This changing weather, protect your family with big discounts! Use code: FIRST10This changing weather, protect your family with big discounts! Use code: FIRST10
ADDED TO CART SUCCESSFULLY GO TO CART
Track your parenting journey

దోమలు శిశువులకు ఎందుకు ఎక్కువ ఆకర్షితం అవుతాయి?

Baby Care
Written by - Dhanlaxmi Raoచివరిగా నవీకరించబడింది: May 2, 2023
దోమలు శిశువులకు ఎందుకు ఎక్కువ ఆకర్షితం అవుతాయి?
Read time2 min

దోమలు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి అనేక రకాల అనారోగ్యాలను వాటితో తీసుకువస్తాయి. ఇవే కాకుండా మీ శిశువుకు దద్దుర్లు, దురదలు, ఏడవటం, చికాకును పెంచుతాయి. దోమలు శిశువులతో సహా ఎవరికైనా కొంచెం ఎక్కువగా ఆకర్షితులు అవ్వడానికి, అధిక శరీర ఉష్ణోగ్రత, అలాగే మనం శ్వాస తీసుకున్నపుడు వదిలే కార్బన్ డయాక్సైడ్ కారణం.

మీ బిడ్డను దోమల నుండి ఎలా సంరక్షించాలి?

  • మీ శిశువు రెండు నెలలు లోపు వయస్సు వారు అయితే, దోమల నివారణకు ఉపయోగించే నిరోధకాలు, లోషన్‌లు, స్ప్రేలు వాడకుండా ఉండటం మంచిది.
  • మీరు వాటిని ఉపయోగించకూడదు కాబట్టి, మీ శిశువును ఇంటి లోపలే ఉంచండి. ముఖ్యంగా తెల్లవారుజామున, అలాగే సాయంత్రం వేళ చురుకుగా ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో మరింత జాగ్రత్తగా ఉండండి.
  • మీరు శిశువును బయటకు తీసుకెళ్లినప్పుడు పొడవాటి చేతులు, వదులుగా ఉన్న దుస్తులను వేయండి. అలాగే పూర్తిగా నెట్‌తో కప్పబడిన స్ట్రోలర్స్‌లో పిల్లల్ని తీసుకెళ్లండి.
  • నీరు ఉన్న ప్రదేశాలలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. మీ ఇంటి చుట్టూ అటువంటి ప్రదేశాలు ఉంటే, నీరు చేరకుండా ఉండేలా వాటిని శుభ్రపరచండి.
  • సుగంధ ద్రవ్యాలు, హెయిర్‌స్ప్రే, సువాసన గల ఇతర శిశువు ఉత్పత్తులను ఉపయోగించకండి. ఇవి కీటకాలను మరింత ఆకర్షిస్తాయి.
  • 2 నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు, మీరు దోమల నిరోధక లోషన్‌ను రాయవచ్చు. అయినప్పటికీ సాధ్యమైనంత తక్కువ రసాయన స్థాయిని కలిగి ఉన్న సరైన నిరోధకాన్ని ఎంచుకోండి.
  • దోమలను తరిమికొట్టడానికి లవంగాలు, సున్నం వంటి ఇంటి చిట్కాలు, సహజ పద్ధతులపై మాత్రమే ఆధారపడవద్దు. మీరు ఇంటి చిట్కాలను ప్రయత్నించాలనుకుంటే, మీ బిడ్డకు రక్షణగా దుస్తులు, దోమతెరలు ఉన్నప్పుడే వాటిని ఉపయోగించండి.
  • దోమల వల్ల వ్యాపించే వ్యాధులను గుర్తించడం నేర్చుకోండి. వెచ్చని, తేమతో కూడిన వాతావరణంలో దోమలు ఎక్కువగా వృద్ధి చెందుతాయి కాబట్టి, ఈ సమయంలో జాగ్రత్తగా ఉండండి. మీ బిడ్డ శరీరమంతా కప్పబడి ఉందని నిర్ధారించుకోండి. అలాగే మీరు శిశువును బయటికి తీసుకుని వెళ్తే, ముందు జాగ్రత్తగా మీతో దోమల నిరోధకాన్ని తీసుకెళ్లండి.

మీ శిశువుకు జ్వరం, దద్దుర్లు లేదా అనారోగ్యం తాలూకు ఏవైనా సంకేతాలు ఉంటే, కారణం తెలుసుకోవడానికి, అలాగే దానికి చికిత్సను ప్రారంభించేందుకు వీలైనంత త్వరగా మీ వైద్యుడిని సంప్రదించండి.

Baby Mosquito Spray - 100 ml

Baby Mosquito Spray - 100 ml

100% Natural Ingredients | Protects Against Dengue, Malaria, Chikungunya

7980 Moms bought
₹149₹24940% Off
Rating
4.5
(149)

Article Posted Under

Related Articles

Medical Disclaimer

This content is for informational purposes only and should not replace professional medical advice. Consult with a physician or other health care professional if you have any concerns or questions about your health. If you rely on the information provided here, you do so solely at your own risk.

foot top wavefoot down wave

AWARDS AND RECOGNITION

Awards

Mylo wins Forbes D2C Disruptor award

Awards

Mylo wins The Economic Times Promising Brands 2022

AS SEEN IN

Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on Business World
Mylo featured on CNBC
Mylo featured on Financial express
Mylo featured on The Economics Times
Mylo featured on Business Today
Mylo featured on TOI
Mylo featured on inc42
Mylo featured on Business Standard
Mylo featured on YourStory
Mylo featured on ANI
Mylo Logo

Start Exploring

wavewave
About Us
Mylo_logo
At Mylo, we help young parents raise happy and healthy families with our innovative new-age solutions:
  • Mylo Care: Effective and science-backed personal care and wellness solutions for a joyful you.
  • Mylo Baby: Science-backed, gentle and effective personal care & hygiene range for your little one.
  • Mylo Community: Trusted and empathetic community of 10mn+ parents and experts.